AP: అస్వస్థతకు గురైన గుంటూరు అన్నపర్రు విద్యార్థులను మంత్రి సవిత పరామర్శించారు. వారికి మెరుగైన వైద్యం అందించాలని ఈ సందర్భంగా వైద్యులను ఆదేశించారు. ఇప్పటికి 17 మంది కోలుకున్నారని, మిగిలిన విద్యార్థులకు చికిత్స కొనసాగుతోందని ఆమె తెలిపారు. అటు విద్యార్థుల అస్వస్థతకు కారణాలపై విచారణ జరుపుతున్నామని పేర్కొన్నారు.