KMM: బోనకల్ మండలం గోవిందాపురం(L)లో చర్చ్‌ను కూల్చిన దుండగులుపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు గిరి అన్నారు. గత రాత్రి సమయంలో కొందరు ఉద్దేశపూర్వకంగానే మత పిచ్చితో JCB సహాయంతో చర్చ్‌ను కూల్చివేశారని చెప్పారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీస్ అధికారులు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.