ELR: పోలవరం నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు నియమితులయ్యారు. ఈమేరకు పార్టీ అధిష్టానం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బాలరాజు కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే పార్టీ బలోపేతానికి కృషి చేస్తామన్నారు.