GDWL: అయిజ మారుతి అకాడమీ తైక్వాండో విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై సత్తా చాటారు. గద్వాలలో గురువారం జరిగిన జోనల్ లెవెల్ SGF తైక్వాండో పోటీల్లో అండర్ 14, 17 విభాగంలో ఉత్తమ ప్రతిభకనబరిచి రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు. విషయం తెలుసుకున్న మాస్టర్ మధు కుమార్ అయిజలో ఇవాళ వారిని అభినందించారు. భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.