NRPT: గత సీజన్లో వరి కొనుగోలు సమయంలో ఎదురైన సమస్యలు పునరావృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో వ్యవసాయ, మార్కెటింగ్, సివిల్ సప్లయి అధికారులతో వరి, పత్తి కొనుగోళ్లపై సమావేశం నిర్వహించారు. వరి, పత్తి తేమ శాతంపై రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు.