SKLM: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యా శాఖా మంత్రి నారా లోకేష్‌లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ పేరిట అనేక కార్యక్రమాలను ఎప్పటికప్పుడు నిర్వహిస్తున్నారని ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో శ్రీకాకుళంలో శుక్రవారం నిర్వహించిన మెగా జాబ్ మేళాకు విశేష స్పందన లభించిందని ఆయన ప్రకటించారు.