SRPT: మాజీ మంత్రి దామోదర్ రెడ్డి చిత్రపటానికి ఇవాళ TG వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో పూలమాళలు వేసి నివాళులు అర్పించారు. ఆయన 2013లో జిల్లా కేంద్రంలో పనిచేస్తున్న దాదాపు 70 మంది జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చారని TWJF అధ్యక్షులు ఐతబోయిన రాంబాబు, కార్యదర్శి బుక్క రాంబాబు అన్నారు. ఆయన మరణం జిల్లా ప్రజలకి మాత్రమే కాక, జర్నలిస్టులకు కూడా తీరని లోటని పేర్కొన్నారు.