PDPL:పెద్దపల్లి మున్సిపల్ కార్యాలయంలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్ నేతృత్వంలో మాదక ద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ చేపట్టారు. ఆయన మాట్లాడుతూ.. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం అందరి బాధ్యతని, యువతను డ్రగ్స్ బారిన పడకుండా కాపాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ లింగయ్య, ఏఈ సతీష్, అధికారులు పాల్గొన్నారు.