W.G: జిల్లాలో పక్కాగా సదరన్ క్యాంపులను నిర్వహించాలని కలెక్టర్ నాగరాణి అన్నారు. శుక్రవారం భీమవరం కలెక్టరేట్లో డీఎంహెచ్వో, డీసీహెచ్ఎస్, ఎన్టీఆర్ వైద్య సేవ జిల్లా కోఆర్డినేటర్, డీఆర్డీఏ పీడీలతో ఆమె సమీక్షించారు. దివ్యాంగ పెన్షన్ లబ్ధిదారుల అప్పీల్స్ మేరకు దివ్యాంగత్వం శాతాన్ని తిరిగి లెక్కింపు కార్యక్రమాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.