JN: జనగామ కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ శుక్రవారం పట్టణంలోని బతుకమ్మ కుంట అభివృద్ధి పనులను శుక్రవారం పరిశీలించారు. పనుల పురోగతిని అడిగి తెలుసుకుని, మిగిలిన పనులను వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ప్రజా అవసరాల దృష్ట్యా అన్ని పనులను సమయానుకూలంగా పూర్తి చేయాలని వారు ఆదేశించారు. సంబంధిత జిల్లా అధికారులు, తదితరులున్నారు.