HYD: అఫ్టల్గంజ్ ప్రాంతంలో కమిషనర్ టాస్క్ ఫోర్స్ ఈస్ట్ జోన్ టీమ్, స్థానికపోలీసుల సంయుక్తదాడిలో భారీగా ఫైర్ క్రాకర్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. దాదాపు రూ.18 లక్షల విలువైన 100 కార్టన్ల ఫైర్ క్రాకర్స్‌ను సీజ్ చేసినట్లు తెలిపారు. లైసెన్స్ లేకుండా నివాసప్రాంతంలో పేలుడు పదార్థాలను నిల్వఉంచిన శ్యామ్ కుమార్ సుగంధీని అరెస్ట్ చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.