MHBD: గార్ల రైల్వే స్టేషన్లో ప్లాట్ ఫామ్‌ను పొడిగించాలని, అండర్ గ్రౌండ్ బ్రిడ్జిని నిర్మించాలని, రద్దు అయిన నాగపూర్ ప్యాసింజర్ పునరుద్ధరించాలని కోరుతూ.. రైల్వే ఉన్నతాధికారులకు స్థానికులు శుక్రవారం వినతి పత్రం అందించారు. రైల్వే అధికారులు సానుకూలంగా స్పందించినట్లు వారు తెలిపారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరిస్తామన్నారు.