MDK: రామాయంపేట మండల కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ స్కూల్ నిర్మాణానికి స్థలాన్ని అప్పగించినట్లు తహసీల్దార్ రజనీకుమారి తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రామ శివారులోని 1421 సర్వే నెంబర్లు 20 ఎకరాల విస్తీర్ణంలో స్కూల్ నిర్మాణానికి స్థలం కేటాయించి, స్థలంకు సంబంధించిన పత్రాలను డీఈవో డాక్టర్ రాధాకృష్ణకు అప్పగించినట్లు పేర్కొన్నారు.