NZB: భూభారతి దరఖాస్తులను ఎట్టి పరిస్థితుల్లో పెండింగ్లో ఉంచవద్దని సబ్ కలెక్టర్ వికాస్ మహ అన్నారు. రెంజల్ తహశీల్దార్ కార్యాలయాన్ని శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన తహశీల్దార్ కార్యాలయంలో భూభారతి దరఖాస్తుల ప్రక్షాళన సరళిని పరిశీలించారు. అప్లికేషన్లను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు.