ATP: బొమ్మనహల్ మండలం కోలగానహల్లిలో శుక్రవారం సైబర్ మోసం జరిగింది. కురాకులపల్లి గ్రామానికి చెందిన రైతు పొలం అమ్మి వచ్చిన డబ్బును బ్యాంకులో జమచేశారు. అక్టోబర్ 9న ఖాతా నుంచి రూ.19,900 చొప్పున ఐదు సార్లు డబ్బు డ్రా అయింది. ఇవాళ ఖాతాను చెక్ చేసుకున్న బాధితుడు బొమ్మనహల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.