కృష్ణా: యువతకు క్రీడా సౌకర్యాలు కల్పించడంలో భాగంగా గన్నవరం నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో 10 క్రికెట్ బాక్సులు ఏర్పాటు చేయనున్నట్లు ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు. రాష్ట్రంలోనే తొలిసారి గన్నవరం గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో రూ.13.5 లక్షల వ్యయంతో నూతనంగా ఏర్పాటు చేసిన క్రికెట్ బాక్సును శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొన్నారు.