MBNR: మహబూబ్నగర్ శిల్పారామంలో నిర్వహించిన మెగా జాబ్ మేళాను ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. నిర్మాణ్ ఓఆర్జీ, ఇన్ఫోసిస్ ఫౌండేషన్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మారుతున్న కాలానికి అనుగుణంగా యువత తమ నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని సూచించారు.