KMM: రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా క్లస్టర్ స్థాయిలోనే యూరియా పంపిణీ చేస్తున్నామని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి పుల్లయ్య తెలిపారు. శుక్రవారం మధిర మండలం మాటూరు రైతు వేదికలో జరుగుతున్న యూరియా పంపిణీ కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. నానో యూరియా, నానో డీఏపీ వాడకం వలన మొక్కకు పోషకాలు ఎక్కువ మోతాదులో అందుతాయని రైతులకు అవగాహన కల్పించారు.