MHBD: తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో డీసీసీ అధ్యక్షుల నియామక ప్రక్రియ వేగవంతమైంది. ఈనెలఖరులోగా నియామకాలు పూర్తి చేయాలని కాంగ్రెస్ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రక్రియ పర్యవేక్షణ కోసం వివిధ జిల్లాలకు పీసీసీ అబ్జర్వర్లను నియమించారు. దీనిలో భాగంగా మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్‌ను మేడ్చల్ మల్కాజ్ గిరి పీసీసీ అబ్జర్వర్‌గా నియమితులయ్యారు.