AP: ఇటీవల రాష్ట్రంలో సంచలనంగా మారిన ములకలచెరువు నకిలీ మద్యం కేసులో ఏ1 నిందితుడు జనార్దన్ రావును ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. సౌతాఫ్రికా నుంచి వస్తున్న ఆయనను గన్నవరం విమానాశ్రయంలోనే అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని, తనను కావాలనే ఇరికించారని జనార్దన్ రావు పేర్కొన్నాడు.