MNCL: మంచిర్యాలలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో శుక్రవారం స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అండర్-14, 17 బాల, బాలికల జిల్లా స్థాయి అథ్లెటిక్ పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ పోటీల్లో 600 మందికి పైగా క్రీడాకారులు పాల్గొన్నారు. ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను జిల్లా జట్టుకు ఎంపిక చేయనున్నట్లు ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి ఎండీ యాకుబ్ తెలిపారు.