NZB: TU ఎన్ఎస్ఎస్ విభాగం సమన్వయకర్తగా ప్రొఫెసర్ కే. అపర్ణ నియమితులయ్యారు. శుక్రవారం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ టి. యాదగిరిరావు చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందుకున్నారు. ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలో ఎన్ఎస్ఎస్ కార్య కలాపాలను ప్రతిష్ఠాత్మకంగా ముందుకు తీసుకువెళ్లి, రాష్ట్ర స్థాయిలో అగ్రస్థానంలో నిలపడానికి కృషి చేస్తానన్నారు.