BDK: ప్రతి పౌరుడు సమాచార హక్కు చట్టం గురించి అవగాహన పెంపొందించుకుని దాని ద్వారా ప్రభుత్వ కార్యకలాపాలపై సమాచారం పొందడమే కాకుండా ప్రజాస్వామ్య పరిపాలనలో భాగస్వామ్యులవ్వాలని భద్రాద్రి జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ పిలుపునిచ్చారు. సమాచార హక్కు చట్టం 2005 అమలులోకి వచ్చి 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శుక్రవారం IDOCలో సదస్సు నిర్వహించారు.