W.G: కార్తీకమాసం సందర్బంగా ఆర్డీవో దాసి రాజు సమీక్షా సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఈమేరకు అక్టోబర్ 22 నుండి నవంబర్ 20 వరకు పాలకొల్లు శ్రీ క్షీరారామలింగేశ్వర స్వామిని దర్శించుకునే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తీసుకోవలసిన ఏర్పాట్లపై చర్చించారు. ఈ కార్యక్రమంలో పాలకొల్లు తహసీల్దార్ వై.దుర్గ కిషోర్, ఎంపీడీవో ఉమామహేశ్వరావు, టౌన్ సీఐ పాల్గొన్నారు.