KMM: ఖమ్మం జిల్లాలో శనివారం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటించనున్నారు. ఈ మేరకు ఆయన పీఏ ఒక ప్రకటన విడుదల చేశారు. కూసుమంచి, నేలకొండపల్లి, ఏదులాపురం మున్సిపాలిటీ, ఖమ్మం నగరం, తిరుమలాయపాలెం మండలాల్లో మంత్రి పర్యటిస్తారని తెలిపారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి, అనంతరం కొన్ని ప్రైవేట్ కార్యక్రమాల్లో పాల్గొంటారని పేర్కొన్నారు.