NRPT: పిల్లలకు సెల్ఫోన్లు ఇవ్వడం వల్ల వాటికి అలవాటు పడి మానసిక రోగాలకు గురయ్యే ప్రమాదం ఉందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ సురేశ్, డిఫెన్స్ కౌన్సిల్ సభ్యుడు లక్ష్మీపతి గౌడ్ హెచ్చరించారు. మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా శుక్రవారం నారాయణపేట జిల్లా ఆసుపత్రిలో అవగాహన సదస్సును నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. మానసికంగా ఇబ్బందులు పడుతున్న వారికి చికిత్స చేయించాలని పేర్కొన్నారు.