BHNG: భువనగిరి పట్టణ పరిధిలో RTC బస్సులు పరిమిత వేగంతో నడపాలని DYFI జిల్లా ఉపాధ్యక్షుడు యండి.సలీం కోరారు. శుక్రవారం స్థానిక బస్టాండ్ ఆవరణలో DYFI పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. RTC బస్సులు పట్టణ పరిధిలో వేగంగా నడపడం వలన 40 రోజుల కాల వ్యవధిలో 14 రోడ్డు ప్రమాదాలు జరిగాయని నలుగురు ప్రాణాలు కోల్పోయారని అన్నారు.