NLR: ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తున్న కూటమి ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ కోటి సంతకాలతో ప్రజా ఉద్యమం చేపట్టేందుకు సంబంధించిన గోడ పత్రికను వైసీపీ కార్యాలయంలో శుక్రవారం ఆవిష్కరించారు. ప్రజారోగ్యాన్ని ప్రైవేట్ పరం చేస్తున్న కూటమి ప్రభుత్వం మెడలు వంచేదాకా ఉద్యమం సాగుతుందని పార్టీ అధినేత జగన్ స్పష్టం చేశారని జిల్లా ప్రధాన కార్యదర్శి అన్నారు.