KMR: దొంగ సొత్తు కొనుగోలు చేసిన వ్యక్తికి 6 నెలల జైలు శిక్ష, లేదా రూ.3వేల జరిమానా విధిస్తూ బిచ్కుంద కోర్టు తీర్పు వెల్లడించినట్లు SP రాజేష్ చంద్ర పేర్కొన్నారు. బిచ్కుంద వాసి పోచవ్వ మెడలోని బంగారు గొలుసును దొంగలించిన దిగంబర్, తుకారాంకు అమ్మాడు. దిగంబర్ మరణించినప్పటికీ దొంగసొత్తు కొనుగోలు చేసిన తుకారాంపై నేరం రుజువు అయింది. ఈ మేరకు కోర్టు తీర్పునిచ్చింది.