JGL: కోరుట్లలో అనుకోకుండా విద్యుత్ షాక్తో మృతి చెందిన వారి కుటుంబాలకు పరిహారం అందించినట్లు ఏడీఈ బొప్పరాతి రఘుపతి తెలిపారు. కోరుట్ల పట్టణం గృహ నిర్మాణ కూలీ షేక్ షఫీక్, మోహనరావుపేట గ్రామం గుండవేణి రాజేందర్ మరణించారు. ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున మొత్తం రూ.10 లక్షల పరిహారం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.