JN: పట్టణంలోని ఓల్డ్ బీట్ బజార్కి పుట్ట శ్రావణ్, అతని భార్య అశ్విని శుక్రవారం పని నిమిత్తం వచ్చారు. తిరిగి వెళుతున్న క్రమంలో 3 తులాల బంగారు గొలుసు ఉన్న బ్యాగు ఎక్కడో పడిపోయింది. వెంటనే వారు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. స్పందించిన పోలీసులు సీసీ కెమెరాలు పరిశీలించి, బ్యాగును దొరకపట్టారు. సీఐ సత్యనారాయణ సమక్షంలో వారికి గొలుసు, బ్యాగు అందజేశారు.