W.G: సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ పై ఒక ఉన్మాద లాయర్ బూటు విసిరిన ఘటనపై భీమవరం అంబేద్కర్ చౌక్ వద్ద కళ్లకు నల్ల రిబ్బన్లు కట్టుకొని శుక్రవారం నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ సమైఖ్య, ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్, సీపీయం, సీపీఐ దళిత సంఘాలు, క్రైస్తవ సంఘాలు, మానవతావాదులు పాల్గొన్నారు.