TPT: తిరుపతి స్విమ్స్ ఆధ్వర్యంలో చంద్రగిరి మండలం కొటాల గ్రామ రామాలయంలో శుక్రవారం ఉచిత కంటి వైద్య శిబిరం జరిగింది. ఈ మేరకు 65 మందికి పరీక్షలు నిర్వహించగా, ఆరుగురిని ఆపరేషన్లకు ఎంపిక చేశారు. దీంతో అక్టోబర్ 10 నుంచి 17 వరకు స్విమ్స్ క్యాటరాక్ట్, గ్లకోమా ఆపరేషన్లు ఉచితంగా చేస్తారని మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్ తెలిపారు.