AKP: కోటవురట్ల మండలం ఎండపల్లి గ్రామంలో బాణసంచా కేంద్రాన్ని తహసీల్దార్ తిరుమల బాబు, ఎస్సై రమేష్ అగ్నిమాపక శాఖ అధికారులతో కలిసి శుక్రవారం తనిఖీ చేశారు. ఇటీవల కోనసీమలో మందు గుండు తయారీ కేంద్రంలో జరిగిన ప్రమాదం గురించి వివరించారు. నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. మందు గుండు సామగ్రి తయారు చేసే సమయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు.