SRD: జిల్లాలో ఈనెల 12 నుంచి 14 వరకు పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు డీఎంహెచ్వో నాగ నిర్మల తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో 1,137 పోలియో బూతు కేంద్రాలను ఏర్పాటు చేశామని, జిల్లాలో ఐదేళ్లలోపు 1,91,668 మంది చిన్నారులు ఉన్నారని అన్నారు. జిల్లాలో ఐదేళ్లలోపు చిన్నారులందరికీ తల్లిదండ్రులు పోలియో చుక్కలు వేయించాలని కోరారు.