ATP: రాయదుర్గం నియోజకవర్గం గుమ్మగట్ట మండలంలోని భైరవాణి తిప్ప ప్రాజెక్టును కలెక్టర్ ఆనంద్ శుక్రవారం సందర్శించారు. ప్రాజెక్టు సామర్ధ్యం, నీటి నిలువ, ప్రస్తుత గేట్ల పరిస్థితి, డ్యాం పరిస్థితిపై ఆరా తీశారు. కాలువలు, ఆయకట్ట గురించి మైనర్ ఇరిగేషన్ ఎస్ఈ విశ్వనాథ్ రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రజాక్ వలి పాల్గొన్నారు.