JN: జనగామ పట్టణ కేంద్రంలోని ఆర్&బి గెస్ట్ హౌస్ వద్ద బీసీ నాయకులు 42% రిజర్వేషన్ పై శుక్రవారం నిరసన వ్యక్తం చేశారు. అగ్రవర్ణ బీసీ వ్యతిరేకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు దూడల సిద్దయ్య గౌడ్ మాట్లాడుతూ.. బీసీ రిజర్వేషన్లను నిలిపివేయడానికి కేసులు వేసిన వారికి భవిష్యత్తులో తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.