GNTR: కొల్లిపర మండలంలోని అత్తోట, చక్రాయపాలెం గ్రామాలకు రేపు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ రానున్నారని ఎంపీడీవో విజయలక్ష్మి తెలిపారు. ఈ సందర్భంగా చక్రాయపాలెంలో నిర్మించిన కమ్యూనిటీ హాల్‌ను ఉదయం 10 గంటలకు ప్రారంభిస్తారన్నారు. అనంతరం అత్తోటలో జరిగే కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేయనున్నారని పేర్కొన్నారు.