SRPT: జిల్లా కోదాడ పీఎం శ్రీ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులు ఈ నెల 17,18 తేదీలలో హైదరాబాదులో జరిగే రాష్ట్రస్థాయి సైన్స్ పోటీలకు ఎంపికయ్యారు. సూర్యాపేటలో జరిగిన సదరన్ సైన్స్ డ్రామా జిల్లా స్థాయి పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచి రాష్ట్రస్థాయికి ఎంపికైన విద్యార్థులను ఉపాధ్యాయులు సన్మానించారు. విద్యార్థులు భవిష్యత్తులో అనేక ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆశాభావం వ్యక్తం చేశారు.