కృష్ణా: గుడివాడ ఏలూరు రోడ్డులోని ప్రజా వేదిక కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము నిర్వహించారు. గుడివాడ పరిసర ప్రాంతాల ప్రజల నుండి ఎమ్మెల్యే రాము శుక్రవారం సమస్యల అర్జీలను స్వీకరించారు. ప్రజా సమస్యలను ఎమ్మెల్యే విని, పలు సమస్యల పరిష్కారానికి అధికారులతో మాట్లాడి తక్షణ చర్యలు తీసుకున్నారు.