AP: రాబోయే 40 ఏళ్లు రాష్ట్రాన్ని యువ నాయకత్వమే ముందుకు నడిపిస్తుందని మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి ఆశాభావం వ్యక్తం చేశారు. దేశంలో ఎన్నో ప్రాంతీయ పార్టీలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చి కాలగర్భంలో కలిశాయని, TDP మాత్రమే 44 ఏళ్లు సుదీర్ఘంగా ప్రజాసేవలో ఉందన్నారు. అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధి కేవలం TDPతో మాత్రమే సాధ్యమని కొండపి పరిధిలో నిర్వహించిన మహానాడులో వ్యాఖ్యానించారు.