kamareddy ఎన్నికల్లో పోటీకి సిద్ధమంటున్న అజహరుద్దీన్..
Kamareddy : హెచ్ సీఏ అధ్యక్షుడు,టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అజహరుద్దీన్ సంచలన ప్రకటన చేశారు. అధిష్టానం అవకాశమిస్తే వచ్చే ఎన్నికల్లో కామారెడ్డి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తానంటూ అజారుద్దీన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన కామారెడ్డి పర్యటించారు.
హెచ్ సీఏ అధ్యక్షుడు,టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అజహరుద్దీన్ సంచలన ప్రకటన చేశారు. అధిష్టానం అవకాశమిస్తే వచ్చే ఎన్నికల్లో కామారెడ్డి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తానంటూ అజారుద్దీన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన కామారెడ్డి పర్యటించారు. లింగంపేటలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో అజహరుద్దీన్ సమక్షంలో పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
కామారెడ్డి నియోజకవర్గం కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీది. 2004లో ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచిన షబ్బీర్ అలీ.. వైఎస్ కేబినెట్లో మంత్రిగా పని చేశారు. అయితే 2009, 2014, 2018 వరుస ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. ఇప్పుడు ఆ స్థానం నుండి పోటీచేయాలని అజహరుద్దీన్ భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లోనూ ఇక్కడి నుంచే బరిలోకి దిగాలని షబ్బీర్ అలీ భావిస్తున్నారు. ఈ క్రమంలో అజహరుద్దీన్ వ్యాఖ్యలపై అందరు ఇప్పుడు చర్చించుకుంటున్నారు. అజహరుద్దీన్ గతంలో కాంగ్రెస్ తరపున యూపీలోని మొరాదాబాద్ నుంచి ఎంపీగా గెలిచారు. ఆ తరువాత ఆయన తెలంగాణ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. కానీ ఇక్కడ ఆయన కాంగ్రెస్ పార్టీలో పెద్దగా రాణించలేకపోతున్నారు.