»Actor Sharwanand And Rakshita Reddys Haldi Ceremony Video Goes To Viral
Sharwanand సందడిగా హీరో శర్వానంద్ పెళ్లి పనులు.. స్విమ్మింగ్ పూల్లో రచ్చరచ్చ
ఇటీవల పెళ్లి పత్రికలు పంచేందుకు వెళ్తున్న సమయంలో శర్వా ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. గాయాలు ఏమీ కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మొన్న తెలంగాణ ఎంపీ జోగినిపల్లి సంతోశ్ కుమార్ కు పెళ్లి పత్రిక ఇచ్చి వెళ్లాడు.
మన కుటుంబంలోని ఓ వ్యక్తిగా కనిపించే నటుడు శర్వానంద్ (Sharwanand). ఇన్నాళ్లు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ఉన్న శర్వా ఎట్టకేలకు 39 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకోబోతున్నాడు. రాజస్థాన్ (Rajasthan)లోని జైపూర్ (Jaipur)లో ఉన్న లీలా ప్యాలెస్ (Leela Palace)లో శర్వా పెళ్లి కార్యక్రమాలు మొదలయ్యాయి. ఈ సందర్భంగా నిర్వహించిన హల్దీ వేడుకలో కుటుంబసభ్యులతో శర్వా సంతోషంగా గడిపాడు. హల్దీ కార్యక్రమానికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది.
తెలంగాణ హైకోర్టు న్యాయవాది మధుసూదన్ రెడ్డి (Madhusudhan Reddy) కుమార్తె రక్షితారెడ్డితో (Rakshitha Reddy) శర్వానంద్ తో శర్వా వివాహం జరుగుతున్న విషయం తెలిసిందే. పెళ్లికి ముందు నిర్వహించిన హల్దీ వేడుకలో కుటుంబసభ్యులతో కలిసి శర్వా సరదా సరదాగా ఉన్నాడు. బంధుమిత్రులు శర్వాకు పసుపు పూశారు. అనంతరం హాజరైన వారికి పసుపు పూస్తూ శర్వా అల్లరి అల్లరి చేశాడు. అనంతరం మిత్రులందరూ కలిసి శర్వాను స్విమ్మింగ్ పూల్లో తోసేశారు. వారితో పాటు మిగతా వారు కూడా పూల్ లోకి దిగి నీటితో ఆడుకున్నారు.
శర్వా పెళ్లికి సినీ, రాజకీయ ప్రముఖులు తరలిరానున్నారని సమాచారం. ఇటీవల పెళ్లి పత్రికలు పంచేందుకు వెళ్తున్న సమయంలో శర్వా ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. గాయాలు ఏమీ కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మొన్న తెలంగాణ (Telangana) ఎంపీ జోగినిపల్లి సంతోశ్ కుమార్ కు పెళ్లి పత్రిక ఇచ్చి వెళ్లాడు. అనంతరం నేరుగా జైపూర్ వెళ్లాడు. శుక్రవారం రాత్రి శర్వా రక్షిత మెడలో మూడు ముళ్లు వేయనున్నాడు.
కాగా ఈ పెళ్లికి రామ్ చరణ్ (Ram Charan), రానా (Rana), ప్రభాస్, విజయ్ దేవరకొండ, నాని తదితర అగ్ర హీరోలు వెళ్తున్నారని సమాచారం. సినీ పరిశ్రమలో శర్వాకు స్నేహితులు చాలా మంది ఉన్నారు. హీరోహీరోయిన్లతోపాటు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు వెళ్లారని తెలుస్తోంది. పెళ్లి అనంతరం సినీ, రాజకీయ, మిగతా బంధుమిత్రుల కోసం హైదరాబాద్ (Hyderabad)లో వివాహ విందు (Reception) నిర్వహించనున్నారని సమాచారం.