TG: మొయినాబాద్లో మాజీ MLA ఫార్మ్ హౌస్లో జరిగిన పార్టీతో KTRకు సంబంధం ఉందని ప్రచారం చేస్తున్నారని MLC దాసోజు శ్రవణ్ మండిపడ్డారు. TPCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అర్థం పర్ధం లేకుండా మాట్లాడుతున్నారని వాపోయారు. రేవంత్ రెడ్డి లాగా ఏది పడితే అది మాట్లాడొద్దని సూచించారు. మూసీ, ఫ్యూచర్ సిటీ అవినీతి బయట పెట్టినందుకు కేటీఆర్ మీద దాడి చేస్తున్నారని ఆరోపించారు.