TG: ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో వరుసగా అక్రమాలు వెలుగుచూడటం భక్తులను విస్మయానికి గురిచేస్తోంది. స్వామివారి ప్రసాదాల తయారీ కోసం వినియోగించే విలువైన సరుకులను కొంతమంది సిబ్బంది అందినకాడికి దోచుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. గోదాముల్లో నిల్వ ఉంచిన బియ్యం, వంట నూనె, కాజు, బాదం పప్పులు పెద్ద ఎత్తున మాయమవుతున్నాయట.