AP: పశ్చిమ గోదావరి జిల్లా అటవీ శాఖ సెక్షన్ అధికారి సురేష్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. పాలకోడేరు మండలం శృంగవృక్షంలో అటవీ శాఖ అధికారి సామిల్లును సీజ్ చేశాడు. సీజ్ చేసిన మిల్లును తిరిగి ప్రారంభించేందుకు రూ.4 లక్షలు డిమాండ్ చేశాడు. బాధితుడి నుంచి రూ.4 లక్షలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు సురేష్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.