TG: రానున్న ఎన్నికల్లో BJP ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు తెలిపారు. ఎవరితోనూ పొత్తులు ఉండవని స్పష్టంచేశారు. రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయిందని.. దేశంలోని ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా తెలంగాణ నుంచే నిధులు వెళ్తున్నాయని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు.