AP: కల్తీ నెయ్యి ఘటనలో సిట్ విచారణ కొనసాగుతోంది. వైసీపీ హయాంలో టీటీడీ ఈవోగా పనిచేసిన ఏవీ ధర్మారెడ్డి వరుసగా రెండోరోజు విచారణకు హాజరయ్యారు. నిన్న జరిగిన విచారణలో పలు ఆసక్తికర విషయాలను ఆయన వెల్లడించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మరింత సమాచారం రాబట్టేందుకు రెండో రోజూ ధర్మారెడ్డిని సిట్ అధికారులు విచారిస్తున్నారు.