AP: సీఎం చంద్రబాబు సమక్షంలో హడ్కో-సీఆర్డీఏ మధ్య ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం మేరకు రాజధాని నిర్మాణాలకు హడ్కో రూ.11 వేల కోట్ల రుణసాయన్ని అందించనుంది. జనవరి 22న హడ్కో బోర్డు నిర్వహించిన సమావేశంలో ఈ నిధుల మంజూరుకు అంగీకారం తెలిపింది. సీఎం సమక్షంలో జరిగిన ఈ ఒప్పంద సమావేశంలో మంత్రి నారాయణ, హడ్కో సీఎండీ సంజయ్ కుల్ శ్రేష్ఠ పాల్గొన్నారు.