E.G: వీరనారి ఝాన్సీ లక్ష్మీభాయి జయంతి వేడుకలు బుధవారం గోకవరం సీఎండీ కార్యాలయం వద్ద ఘనంగా నిర్వహించారు. ఝాన్సీ లక్ష్మీభాయి చిత్రపటానికి విశ్వహిందూ ధర్మపరిరక్షణ రామసేన అధ్యక్షులు, బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఝాన్సీ లక్ష్మీబాయి ధైర్యసాహసాలకు ప్రతీకగా నిలిచి, బ్రిటిష్ వారిని ఎదిరించి స్వతంత్రం కోసం పోరాడిందన్నారు.